కహ్లీల్ గిబ్రాన్ “The Prophet” – అనువాదం, తెలుగులో – #1

ముందుమాట:

ఒక తెలుగువాడిని అయ్యుండి నేను నా మాత్రు భాష లో రాయట్లేదు అన్న ఆవేదన చాలా కాలంగా నాలో ఉంది. నా భాష గొప్పది అన్న విషయం నాకు నాడి నాడి లో ఇమిడిన నిజమే అయినా, నా భాష లో నేను ఏమి రాయగలనో నాకు పాలుపోలేదు. ఎన్నో కథనాలను పరిశీలించినా, నాలో చాలా సంవత్సరాలుగా భారతీయుల్లో మిగిలిపోయిన ఆంగ్లేయ ఆలోచనా విధానం, వారి భావ విశ్లేషణా శైలి ఒక తెలుగు నేల మీద పుట్టిపెరిగిన వాడిలా ఆలోచించనివ్వవు, మాట్లాడనివ్వవు, రాయనివ్వవు. ఒక లియో టాల్స్టాయ్, హెర్మన్ మెల్విల్, వర్స్వర్త్ లేదా డికెన్స్ తెలిసినంత బాగా నాకు ఏ ఒక్క తెలుగు రచయితా తెలీదు. అది నా దురదృష్టం. ఇరవై మూడు సంవ్సరాలు రాక ముందే ఒక పుస్తకం రాయాలి అని కంకణం కట్టుకున్న నాకు అది మా అమ్మా నాన్నా చదివితే ఆనందిస్తారు అన్న కనీస ఆలోచన రాలేదంటే, నాలో తెలుగు వాడి సున్నితమైన కుటుంబ భావోద్వగాలు సన్నగిల్లి, పాశ్చా్త్య “ఇండిపెండెంట్” మౌఖిక సిద్ధాంతం ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం అవుతుంది. ఎన్నో సందర్బాలు తర్వాత నేను ఒక తెలుగు నవల రాయాలి అని నిర్ణయించుకున్నాను. ఇదే విషయం నా చెల్లికి నా స్నేహితురాలికి చెప్పాను. ఎంతో ఆనందించారు, ప్రోత్సహించారు. ఇదే సమయంలో మా నాన్నగారు ఈ మధ్య సాంకేతికతకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండాలి అన్న ఆలోచనతో ఆయనకు ఎంతో ఇష్టమైన చరిత్ర, ఇతాసం, వివిధ దేశాల వీరులు, సంస్కృతులకు సంబంధించిన పుస్తకాలను చదవటం మొదలుపెట్టారు. నాకు చాలా మంచి భావన కలిగింది. నాకు తెలిసిన ఆంగ్ల రచయితల తెలుగు అనువాద పుస్తకాలు చెప్పాను, ఆయన చాలా ఆనందంగా కొనుక్కుని చదవటం మొదలు పెట్టారు. ఆయనకు తెలిసిన తెలుగు పుస్తకాలూ కొనుకున్నరు. మొదలుగా నేను “the alchemist” అనే పుస్తకాన్ని ఆయనకు ఇచ్చాను, అప్పుడు అనిపించింది, నేను కూడా తెలుగులో ఏమైనా రాయాలి అని. ఒక తెలుగు పండితుడి మనవడిగా, ఒక కథాల రచయితగా ఒక్క తెలుగు కథ అయినా రాయాలి, రాసింది అందరూ చదవాలి అని అనుకున్నా. అక్కడ మొదలు ఈ ప్రయత్నం.

ఎన్నో విషయాలు పరిగణనలోకి తీసుకొన తర్వాత “9” అనే ఒక కథను సిద్ధం చేసా. తొమ్మిది జీవితాలు ముడిపడిన కథ అది. ఒక జననం ఎంత ముఖ్యమైనది, ఒక ప్రాణం ఈ భూమి మీదకు రావటానికి పడే తపన, ఒక గర్భం పశిప్రాణంగా మారే తరుణం ఈ విశ్వంలో ఎంత విన్నుత్తనమైనది, ఎంత ప్రాముఖ్యత కలిగినదో తెలియచేసే కథ సిద్ధం చేసా. ఆ ప్రాణం తల్లి కడుపులో ఉండే తొమ్మిది నెలల్లో కథ నడుస్తుంది. ఎన్నో ఆపదలు, అపాయాలు, అపకారాలను దాటుకుని, ఈ కుల, మత, వర్గ కల్లోల సమాజంలోకి ఒక కఠినమైన పరిస్థితిలో ఆ ప్రాణం బ్రతికి బయటకు వస్తుందా లేదా అన్నది కథాంశం. కానీ తర్వాత వచ్చింది అసలు సమస్య. ఆంగ్లంలో ఆ కథను (ఏ కథ అయినా) సంవత్సరం తిరగకుండా రాయగలను. సునాయాసంగా. తెలుగులో ఎక్కడ రాస్తా! అప్పుడు అనుకున్నా “నాకు కావాల్సింది తెలుగు లో రాయటం సాధన చెయ్యటం,” అని. అలా అనుకున్న నేను, కొంత కాలానికి ఆ విషయం పూర్తిగా మర్చిపోయా. అసలు గుర్తే లేదు. నా రెండోవ ఆంగ్ల నవల మీద కసరత్తు మొదలు పెట్టా. దానికి తోడు జీవితం లో లెక్కలేనన్ని మార్పులు రావడం మొదలు అయ్యాయి. అలా జీవనయాత్రలో ఈలలు వేస్కుంటూ దూసుకుపోతున్న నన్ను తట్టి లేపాడు Khalil Gibran. ఈ సూఫీ కవి రాసిన “The Prophet” పుస్తకాన్ని చదివిన నేను ఎంతో ప్రభావితుడనయ్యాను. చాలా కాలం పాటు ఆ పుస్తకం లో ప్రస్తావన చేయబడిన విషయాలను మనసులో ఉంచుకున్నను. వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. పన్నెండో శతాబ్దం పర్సియన్ కవి Rumi తర్వాత ఆ స్థాయలో నాకు నచ్చే ప్రాకృతిక సిద్ధాంతాలను ప్రతిపాదించిన కవి గిబ్రనే. అలా నా మనసుకి, ఆలోచనకు ఎంతో దగ్గరగా ఉన్న ఆ పుస్తకాన్ని ఎలాగ అయినా తెలుగులోకి అనువదించాలి అని అనుకున్నా. అది ఎవరికోసమో కాదు. నా కోసం. ఆ పుస్తక అంతరంగం కేవలం చదివితే అర్థం కాదు, దానిని అనుభవించాలి అని అనుకున్నా. అది అలా అనుభవిస్తే మాత్రమే అర్థమయ్యే విషయం అని నమ్మకం పెట్టుకున్న. జీవితాన్ని మార్చే శక్తి ఆ పుస్తకానికి ఉంది అని నమ్మా. ఆ శక్తి నాకు ఎల్లవేళలా, స్పృహలో నిస్పృహలో తోడుగా ఉండాలి అనిపించింది.

ఈ అనువాదానికి బీజం వేసా.

ఇక్కడ నేను రాయబోయే ప్రతి ఆలోచన, ప్రతి సిద్దాంతం ఆ పుస్తకం నుండి తేసుకున్నవే. మక్కీ కి మక్కీ రాయకుండా కొన్ని మార్పులు చేసినా, ఆ పుస్తకానికి విధేయుడుగా ఉంటూ పుస్తకాన్ని పూర్తిగా ఇరవై ఆరు అధ్యాయాలుగా (ఏడు blogs గా) రాస్తా. ఎలాగ అయినా ఈ సాహసాన్ని పూర్తి చేస్తా. ఈ ప్రయాణం లో నాకు అందరూ అండగా ఉండాలి అని కోరుకుంటూ, తప్పులను చిన్నవడిగా నన్ను భావించి మన్నిస్తారు అని ఆశిస్తూ . . .

– గోపరాజు శ్రీ సాయి నాగేంద్ర శర్మ. రచేత, Dark Side of The Coin.

కహ్లీల్ గిబ్రాన్ “The Prophet” – అనువాదం, తెలుగులో.

నా ఈ ప్రయత్నం నా భాషకు, నా అమ్మానాన్నలకి, నా చెల్లికి, నా స్నేహితురాలికి అంకితం.

అధ్యాయం ౧: ఆమ్లుస్తాఫా మరియు ప్రేమ

అది ఐఏలోల్ మొదలైన ఏడవ రోజు. ఓర్ఫలేస్ నగరవాసులకు పంట చేతికి వచ్చే కాలం మొదలైన వేల. ఆ రోజు తెల్లవారే సమయానికి ఆమ్లుస్తాఫా ఆ నగర గోడల అవతల ఉన్న కొండ మీదకు ఎక్కి సముద్రం వైపు చూడసాగాడు. ఆమ్లుస్తాఫా ఒర్ఫలేస్ నగరానికి వచ్చి అప్పటికి పన్నెండు సంవత్సరాలు పూర్తి అయ్యింది. తనే జీవిత ప్రయాణంలో ఆఖరి దశలో ఉన్నపటికీ, పన్నెండు సంవత్సరాలుగా తను పుట్టిన నేలను మరలా చూడాలన్న ఆకాంక్షతో ప్రతీ రోజూ ఆ ఓడ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఆరోజు, ఆమ్లుస్తాఫాకు మంచుతెరలను చీల్చుకుంటూ అతని వైపు వస్తున్న ఆ ఓడ కనపడింది.

ఆమ్లుస్తాఫా ఆనందానికి అవధులు లేవు. అతని హృదయం నుండి ఆ సముద్రం వైపు సంతోషం ఏరుగా ఎగసింది. ఒక్కసారి అతడు తన కళ్ళను మూసుకుని తన హృదయ మందిరములో మనసుని దేవుడుగా తలచి ప్రార్థన చేశాడు. కళ్ళు తెరిచి ఆ కొండను దిగుతూ ఆ సముద్రం వైపు నడవసాగాడు.

అలా కొండ దిగుతున్న ఆమ్లుస్తాఫా మనసు ఒక సంశయం లో పడింది. ఒక బాధ అతని అంతరంగంలోపల వెలుగులోకి వచ్చింది. అతను కొరుకున్న ఓడ ఈ రోజు వచ్చివుండచు. అతను పన్నెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైఉండొచ్చు, కానీ అది అతని మనసుకు పూర్తి అన్నందాన్ని ఇవ్వలేదు.

కొండ రాళ్ళను దాటి దిగుతున్న మనసు దిగులుపడింది: “గాయపడక ఈ మనసు ఈ నగరగోడలను వీడిపోగలదా! కుదిటపడని ఈ మనసును మోస్తూ దుఃఖపడక పదము కదపగలనా?

రాత్రుల కౌగిలిలో ఒంటరి అయివున్నా, వేకువ సమయములో వేదనపడుతున్నా, వీడిపోయే ఈనాడు, మనసు కలతపడక కునుకు తీయగలనా!

అడుగు అడుగునా మనసులాగు ఈ వీధులలో, ప్రాణవాయువు పంచి మంచి కాలము గడిపినా. ఈ కొండలలో, ఈ వాగులలో, నా మనసు మూలలనుండి ఉాలలాడిన ఊసులు ఊగులే. ఎట్టి మనసు పొగలదు కలత పడక ఈ నగరం వీడి. కోత కదా హృదయానికి ఈ వీడుకోలు?

మర్చునది కాదు వస్త్రం; రక్తం చిందు చర్మదారం. మాట కాదు విడుచునది; మనసు వీరి కోసం.”


ఇక మోయాలేను ఈ భారం. మనిషి మనుగడను సైతం ముంచుకెల్లే సంద్రం పిలుచువేల, వంచి తల నేను వెళ్ళ సమతం. ఆగు ప్రతి రేయి కాలుబందించు పరిహారం. మాటను మోయదు పెదవుల పెనుభారం, గూడును మోయదు గద్దల సందోహం. అట్టిది నేను ఎటుల మొయను ఈ నగర పరిమాణం?”

అలా ఆలోచిస్తూ కొండ దిగిన ఆమ్లుస్తాఫా, ఒడ్డు చేరిన ఓడను చూసాడు. ఆ ఓడలో అతనికి తనకోసం వచ్చిన అతని సొంత జనం కనిపించారు. వెంటనే అతని మనసు వారిని చేరటానికి ఉర్రూతలూగింది.

అతని ఆత్మనందు ప్రియగానం ఇలా ప్రతిద్వనించింది: “నా మాతృభూమి మన్నులో తనువుగాంచిన నా సోదరులారా, సంద్రపు అలలలో వేడుకలు జరుపుకునే వీరులరా! ఎన్ని మార్లు నా కలలప్రపంచంలో మీరు తేలియాడారో ఎటుల తెలుపను? ఈ దినము నా వేకువలోకి వచ్చారు – నా నిదురను మించిన మాయలోకి వచ్చారు.

మరొక్క క్షణము మాత్రమే ఈ స్తంభించిన నేల గాలులను పీలుస్తూ, ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తా. ఆ క్షణము అవల ఆ ఓడనందు, మీ మధ్య ఉంటా: నావికులయందు నావికుడిగా, నా సోదరుల మధ్య సోదరుడిగా.

ఒక్క ఓడ యందే కాక, సకల నదులకు, పారు ప్రతి సరసుకు విముక్తినిచ్చు సంద్రము పైన నిలుచుని ఉంటా. అన్నిటికీ స్వేచనిచ్చే సంధ్రము మనకు ఇవ్వక ఉంటుందా! ఒక్క సారి ఓడ హుంకరించాకా, ఒక్క సారి తెడ్డు తేలాకా క్షణం క్షణం ఇక స్వేచ్ఛా జీవితమే.

ఓ అంతులేని సంద్రమా, ఈ అంతులేని ఓ చినుకు నీలోకి వస్తుంది.”

ఇలా మాట్లాడుతూ ఓడ వైపు వస్తున్న ఆమ్లుస్తాఫా, ఓర్ఫలేస్ కార్మికులు, శ్రామికులు తమ పనులను విడిచి పరుగు పరుగున పొలాల్లోనుంచి, కంగారుగా వారి ఇళ్ల నుంచి, ఓడ వైపుకూ, తన వైపుకూ తరలి రావటం చూసాడు. అతని ఓడ రాక గురించి నగరం మొత్తానికి తెలిసింది.


అట్టి ఆప్యాయాన్ని చూసిన ఆమ్లుస్తాఫా, తన మనసులో ఇలా అనుకున్నడు:

“ఈ పూట కలయికకు చిహ్నంగా నిలుస్తుందా లేక వీడిపోవటానికా? నిస్సారమైన నా జీవిత సాయంత్రమే నాకు రేయిగా నిలుస్తుందా?

నాకోసం నాగలి విడిచిన రైతుకు నేను ఇప్పుడు ఏమి ఇవ్వగలను? నాకై చేతి నేతను విడిచిన శ్రమికుడికి నేను ఏమి చెప్పగలను? వారికి ఇచ్చేంత పండ్ల సంపద నా మనస్-వృక్షానికి ఉందా? నా మనసు సంద్రమై పారినా వారి ఆశల దోసిలిని నింపునా?

వారి స్పర్శకు ప్రణమిచ్చే వీణను కాను, వారి ఊపిరికి గానమిచ్చే వెనువును కాను. ప్రాకృతిక మౌనంలో మునిగిపోయిన నేను, మౌనము నేర్పిన పాఠాలు వీరికి ఎటుల చెప్పను? ఈనాడు నా మనసున పూసిన పూలచెట్ట్లు ఏనాడు నాటానో నాకైనా తెలుసా!

నేను పట్టే కాగడైనా నా మనసులోని చీకటిని చిదిమేనా? చీకటినందు నిలిచిన నా కాగడా ఆ చీకటి వీధుల రారాజు వాడుటకు తప్ప పనిచేయునా?”

ఇలా తను మాట్లాడుకున్నా, మాటల్లో చెప్పలేని మనోభావాలు లోపల ఉంటూనే ఉన్నాయి. అతను ఆ కొండను పూర్తిగా దిగి నగరమధ్యలోకి రాగానే, ఆ నగరవాసులు అతని చుట్టూ చేరి, ఏకకంఠంతో అతనిని వెలోద్ధని ప్రదేయపడసాగారు.

నగర పెద్దలు, “నీవు వెళ్లొద్దు. అప్పుడే వెళ్లొద్దు. మా జీవిత సయంత్రాలలో మాకు ఉదయించే సూర్యుడిలా తోడుగా ఉన్నావు. అతిథి కాదు నీవు పరునివి కావు. కొడుకువి నీవు, మా బిడ్డవి. నీ ముఖము కొరకు తపన పడే మా కళ్ళకు కలతనీకు.” అని ప్రాధేయపడ్డారు.

ఆ నగర మగా మరియు ఆడ పూజారులు, “ఆ సముద్ర కెరటాలు నీ ఉనికిని మాకు ఒక జ్ఞాపకంగా మార్చనివ్వకు. ఒక మనిషిలా కాక ఒక మునిలా మా మధ్య ఉన్నావు, నీ నీడ స్పర్శను మాకు దూరం చెయ్యకు. నిన్ను ఎంతగానో ప్రేమించిన మేము ఆ ప్రేమను మౌనమనే ముసుగులో ఉంచుకున్నాము. కానీ ఇప్పుడు ఆ ప్రేమ నిన్ను వెళ్లనివ్వొదు అని కేకలు పెడుతోంది. నీకు కనిపించాలి అని తపన పడుతోంది. ఈ క్షణం నీవు వెళ్ళుటకు సిద్దపడువరుకూ దానికి అది ఎంత ముఖ్యమో తెలియలేదు.” అని వారి బాధను వ్యక్తపరిచారు.

వారి పిదప, ఒకరి తరువాత ఒకరు ఆమ్లుస్తాఫాను వెళ్లొద్దని వేడుకున్నారు. కానీ ఆమ్లుస్తాఫా తన తలను బాధతో దించుకున్నాడే తప్ప వారికి సమాధానం ఇవ్వలేదు. అతనికి ఎంతో దగ్గరగా ఉన్నవారికి తప్ప అతని కన్నీరు ఎవరికీ కనపడలేదు. అక్కడ నుంచి ఆమ్లుస్తాఫా మెల్లగా ఆ నగరవాసులతో ఆ నగరం మధ్యలో ఉన్న గుడి దగ్గరకు నడిచాడు.

ఆ గుడిలోపల నుంచి, ఒక కాలజ్ఞాని అయిన ఆల్మిత్రా అనే మహిళ బయటకు వచ్చింది. ఆమ్లుస్తాఫా ఆల్మిత్రా వైపు ఎంతో భారంగా చూసాడు. అతను ఈ నగరానికి వచ్చినపుడు అతనిని నమ్మి అతనికి ప్రేమగా ఆశ్రయం ఇచ్చింది తనే. ఈనాడు వీడిపోతూ ఆమె దగ్గరకు వచ్చిన అతనిని ఆమె కూడా అలాగే చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది:

“ఓ దైవదూతా, విశ్వపుఅంచులను దాటుకుని వెళ్లే నీ అన్వేషణలో, ఆ ఈ ఓడలో దూరతీరాలకు నీవు తరలి వెళ్ళావు. మరలా నీ ఓడ నీకై వచ్చింది. నీ గురుతుల మజిల్లిల్లో ఇమిడిపోయిన నేలను చేరాలన్న నీ తపన అంతులేనిది. ఆ నీ చోటుని చెరనివ్వక మా ప్రేమ నిన్ను కట్టిపడేయదు.

కానీ నీవు వెళ్ళు క్షణమున, మాతో మాట్లాడి, నీ జ్ఞానాన్ని మాకు పంచు. నీ నుంచీ పొందిన జ్ఞానాన్ని మా పిల్లలకు, వారి నుంచి వారి పిల్లలకు చేరవేస్తూ ఎన్నటికీ మన్నుకానివ్వము.

నీ ఒంటరితనములో మా రోజులు చూసావు, నీ మెలుకువలో మా నిదురించే బాధలు చూసావు. మాకు జ్ఞానమునివ్వు: మా జనన మరణ అంతరంగము గురించి మాకు జ్ఞానమునివ్వు.”

దానికి అతను సమాధానం ఇచ్చాడు. “ఓర్ఫాలేస్ ప్రజలారా! విశ్వం అంతా ఇమిడ్చుకున్న మీ మనస్సుకు తెలియని ఎటువంటి విషయాన్ని నేను మీకు చెప్పగలను?”

దానికి ఆల్మిత్రా, “ప్రేమ గురించి మాట్లాడు,” అని అడిగింది.

మొదలు దించిన అతని తల, అప్పుడు ఆ జనసముద్రాన్ని చూడటానికి లేచింది. అతని చూపు పడిన క్షణం నుంచి ఆ ప్రజలలో లోతైన నిశబ్దం అలవరింది. చూపు చెదరక అందరూ అతనినే చూడసాగారు.

అప్పుడు ఆమ్లుస్తాఫా తన గంభీరానికి మృదుత్వం కలిసిన గోంతుతో మాట్లాడసాగాడు:

“ప్రేమ పిలిచిన వేళ, వెంట వెళ్ళండి. అతని దారులు కష్టంగా ఉన్నా, అగాధంలా అనిపించినా, వెంట వెళ్ళండి. అతని రెక్కలు మిమల్ని కప్పినప్పుడు అతనికి సమ్మతం తెలపండి. అతని చెరల్లో కత్తులు ఉన్నా, అవి గాయం చేస్తున్నా, వీడకండి. ప్రేమ మాట్లాడినప్పుడు నమ్మండి. అతని మాట ఒక తోటను ధ్వంసం చేసే రాల్లవానవలే మీ కలల్ని ధ్వంసం చేసినా, నమ్మండి.

ప్రేమ మీ తలపై కిరీటాన్నీ ఉంచుతుంది, మిమ్మల్ని సిలువకూ వేళ్లాడతీస్తుంది. ప్రేమ మిమల్ని ఎదిగేలా చేస్తుంది, దహించీవేస్తుంది.

ప్రేమ మీ అంత అయ్యి మీ కొమ్మలను సూర్యుడికి పరిచయం చేస్తుంది. అదే ప్రేమ మీ వేర్ల వరుకూ తవ్వి మీ అడుగుజాడలను అతలాకుతలం చేస్తుంది.

ప్రేమ వరికుప్పలాగ మిమ్మల్ని దగ్గరకు తెస్తుంది. ప్రేమ మిమ్మల్ని మీకు నిజంలా పరిచయం చేస్తుంది. ప్రేమ మీ పైపై ఉన్న పొరలు అన్నిటినీ తుంచి వేస్తుంది. మిమల్ని నిజమైన వెలుగులోకి తీసుకొస్తుంది. ఈ ప్రేమ మీరు పూర్తిగా మీరు అయ్యేవరకు మిమ్మల్ని నేస్తూనే ఉంటుంది. అలా పూర్తి అయిన మిమ్మల్ని యజ్ఞయాాదులలో వేసిన మహత్తరమైన కానుకలాగ ఆ దైవం ముందు నుంచోపెడుతుందీ ప్రేమ.

కానీ ఈ ప్రేమ మిమ్మల్ని మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకునే వరుకూ చేరదు. మీ రహస్యం ఏమిటో తెలుసుకుని ఆ రహస్యాన్ని మీ జీవితంలో ఒక అంతర్భాగం చేసుకున్నప్పుడే మీరు నిజమైన ప్రేమను పొందుతారు.

మానవ సహజగుణమైన భయములోపడి, కేవలం ప్రేమ యొక్క ప్రశాంతతని, సుఖాన్ని మాత్రమే కోరుకోవద్దు. అటువంటి ప్రేమ కావాలి అనుకుంటే, మీ నిజత్వన్ని విడిచి ప్రేమమందిరం నుండి వెళ్ళిపోవటం మంచిది. అటువంటి సుఖమైన ప్రేమను మాత్రమే కోరుకునే వారు నవ్వు పూచే కాలంలో మనసుని నవ్వుతో నింపలేరు, బాధ నిండే సమయంలో మనసారా పూర్తిగా ఎడవలేరు.

ప్రేమ ప్రేమను తప్ప మరొకటి ఇవ్వదు. ప్రేమ ప్రేమను తప్ప మరి ఏదీ తీసుకోదు. ప్రేమ ఎవ్వరినీ బలవంతముగా ఆవహించదు, లేక ఎవ్వరిచేతా ఆవహింపబడదు. ప్రేమ ప్రేమగా ఉంటే అంతే చాలు.

నువ్వు ప్రేమని కనుగొన్నప్పుడు, “దేవుడు నా హృదయములో ఉన్నాడు,” అన్నది మరచి, “నేను దేవుని మనస్సులో ఉన్నాను,” అన్న సత్యాన్ని గుర్తిస్తావు. కానీ ప్రేమను పొందటానికి దారులు వేతకొద్దు; సమర్డుడివి అయితే ప్రేమే నీ వైపు వస్తుంది.

ప్రేమకు ప్రేమ తప్ప మరో కోరిక లేదు. కానీ ఆ ప్రేమ మిమ్మల్ని ఆశతో నింపెస్తే, ఆ ఆశను ఈ విషయాలు తెలుసుకోవడం గురించి వాడండి:

ఆ ప్రేమ కోసం రాతిరి సైతం గానం చేసే సెలయేరులా మారటం తెలుసుకోండి. అతి సున్నితంగా ఉంటే పడాల్సిన బాధను తెలుసుకోండి. ప్రేమ గురించి తెలుసుకునే యత్నంలో గాయపడటం తెలుసుకోండి; ఆ బాధను కూడా ఆనందంగా, ఇష్టంగా అనుభవించటం తెలుసుకోండి. ప్రతీ వేకువలో మనసు రెక్కలు విప్పి మరో రోజు ఉందన్న ఆనందాన్ని పొండటం తెలుసుకోండి. మద్యాణాలు ప్రేమ గురించి ఆలోచిస్తూ ఆనందపడి, సాయంత్రం ప్రేమతో నిండుగా ఇంటికి వెళ్లటం తెలుసుకోండి. అటువంటి ప్రేమను మనసులో పెట్టుకుని, ప్రేమనిచ్చే పేరును పెదాలపై ఉంచుకుని, కృతజ్ఞతతో నిదురపోవటం తెలుసుకోండి.” అని ముగించాడు.

అప్పుడు ఆల్మిత్రా, “అట్టి యడల, వివాహం గురించి కూడా చెప్పండి,” అని అడిగింది.


{తర్వయి భాగం తరువాత blog లో. . .}

6 Comments Add yours

 1. BHARGAV NAIDU LAVETI says:

  మీ యొక్క తరువాయి భాగం కోసం. ఎదురు చూస్తూ… మీ భార్గవ్ నాయుడు లావేటి.

  Liked by 1 person

  1. Thank you so so so much, man. Thank you so much!

   Like

 2. RadheshGorle says:

  Loved it!! It’s a real risk…. But you did for our mother tongue.. This it the land of greatest poets and play writers of country and now no one is caring about the literature of Telugu. I am really inspired to read this. Developing the language!!!

  Telugu was the language of greatest writers like, Athreya, Veturi, Gurujada, Tyagayya, etc…. This comment will be the longest comment if I mention all the names. That is the vastness of Telugu literature.

  Finally, now

  దేశభాషలందు తెలుగు లెస్సా !!!

  Liked by 2 people

  1. Loved it so much! Total you so much, man!

   Liked by 1 person

 3. Gurazada srikar says:

  Too good..as a beginner you have succeeded bringing the emotional and intellectual connect from characters..which is the actual necessity of translation..there are some words and phrasing mistakes here and there but they can be rectified in your future ones..once again loved it from the core and waiting eagerly for next one…bring it on..

  Liked by 1 person

  1. Thank ya, man! Thank ya so much!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s